PM Modi: ‘నేనూ ఎంజాయ్‌ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్‌ చేసిన మోదీ

తనపై వచ్చిన ఓ మీమ్‌ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్‌మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.

Published : 07 May 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. వ్యక్తిగత విమర్శలూ ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు కొందరు నేతలు సహనం కోల్పోతుంటారు. వ్యక్తిగత దూషణలకూ దిగుతుంటారు. కానీ, తనపై వచ్చిన ఓ మీమ్‌ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్‌మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.

కృష్ణ అనే వ్యక్తి ఎక్స్‌లో తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ప్రధాని మోదీ రూపంలో ఉన్న వ్యక్తి స్టేజీపై డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోకు క్యాప్షన్‌ రాస్తూ.. ప్రధాని మోదీని నియంతతో పోల్చాడు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేయడమే కాకుండా ‘మీ లాగే నేనూ నా డ్యాన్స్‌ చూసి ఎంజాయ్‌ చేశా’ అంటూ మోదీ రీపోస్ట్ చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి సృజనాత్మకత సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కూలెస్ట్‌ పీఎం’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘మిమ్మల్ని నియంత అన్న వ్యక్తికి ఇది చెంప దెబ్బలాంటిది’ అంటూ పోస్టులు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని