kesariya lyrics: ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’

‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Published : 07 May 2024 00:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1 శివ’. 2022లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా విజువల్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రీతమ్‌ అందించిన సంగీతం శ్రోతలను ఎంతగానో అలరించింది. ‘కేసరియా’ (Kesariya) సాంగ్‌ యువ హృదయాలను అమితంగా రంజింపజేసింది. ఇప్పుడు ఈ సాంగ్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ వేదిక స్పాటిఫైలో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ ఫ్లాట్‌ ఫాం వేదికగా 500 మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ దాటిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. సోనీ మ్యూజిక్‌ ఇండియా ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తంచేసింది. అమిత్‌ భట్టాచార్య సాహిత్యం అందించిన పాటను అర్జిత్‌సింగ్‌ ఆలపించారు. ఇక యూట్యూబ్‌ వేదికగా ఈ సాంగ్‌ అత్యధిక వ్యూస్‌తో అలరిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 76 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది.

వచ్చే ఏడాది పార్ట్‌-2 పనులు

దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్రస్తుతం ‘వార్ 2’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో ఈ మూవీ రూపొందుతోంది. దీంతో ‘బ్రహ్మాస్త్ర పార్ట్‌-2 దేవ్‌’ మరింత ఆలస్యం కానుందంటూ వార్తలు వచ్చాయి. ఆదిత్య చోప్రా కోరిక మేరకు ‘పార్ట్‌2’కు కాస్త విరామం ఇచ్చి ‘వార్‌2’కు దర్శకత్వం వహించేందుకు అయాన్‌ముఖర్జీ ఆసక్తి చూపారని, ఈ విషయంలో కరణ్‌ జోహార్‌ కూడా అభ్యంతరం చెప్పలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌ చివరికి ‘వార్‌2’ పూర్తవుతుంది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని జనవరి 2025 నుంచి బ్రహ్మాస్త్ర 2 మొదలుపెట్టనున్నారు. 2026 ప్రథమార్ధంలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని