కోల్‌కతా నుంచి బాలిక అక్రమ రవాణా

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:30 IST

కోల్‌కతా నుంచి బాలిక అక్రమ రవాణా

హైదరాబాద్‌లో గుర్తించిన మహిళాభద్రత విభాగం

ఈనాడు, హైదరాబాద్‌: కోల్‌కతాలో అపహరణకు గురైన బాలికను తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో గుర్తించారు. నాలుగు నెలల అనంతరం బాలికకు నిందితుడి చెర నుంచి విముక్తి కలిగించారు. జూన్‌ 19న పశ్చిమ్‌బెంగాల్‌లోని కనకుల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాల ఆధారంగా బాలికను రక్షించడంతో పాటు నిందితుడినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాకు చెందిన బాలిక(17)ను అదే ప్రాంతానికి చెందిన సంతు పరమాణిక్‌ అక్రమంగా హైదరాబాద్‌ తీసుకొచ్చాడని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ మహిళా భద్రత విభాగం నేతృత్వంలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం రంగంలోకి దిగింది. ఎస్సై హరీశ్‌ నేతృత్వంలోని బృందం బాలికతో పాటు సంతు వివరాల ఆధారంగా దర్యాప్తు ఆరంభించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కాల్‌ డేటా వివరాలను సేకరించి వారు చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించింది. బాలికను సఖి కేంద్రానికి పంపించి నిందితుడిని పోలీసులకు అప్పగించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన