Published : 05/05/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో సంఘటన స్థలం పరిశీలన

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న తితిదే అదనపు

ఈవో ఏవీ ధర్మారెడ్డి, చిత్రంలో వీజీవో

బాలిరెడ్డి, డీఎస్పీ ప్రభాకర్‌రావు తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సంఘటనా స్థలాన్ని తితిదే అధికారులు, రాజకీయ నాయకులు పరిశీలించారు. దుకాణదారులను, మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, వీజీవో బాలిరెడ్డి, డీఎస్పీ ప్రభాకర్‌రావు పరిశీలించారు. ప్రమాదంపై ఆరాతీశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. ప్రమాదంలో మృతిచెందిన మల్లిరెడ్డి భార్య శోభను ఓదార్చారు. మృతుని కుటుంబాన్ని తితిదే ఆదుకోవాలని, మృతుని భార్యకు తితిదే ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతుని కుమారుడు చైతన్యను ఎన్టీఆర్‌ ట్రస్టుద్వారా ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మృతుడి కుమారుడిని ఓదార్చుతున్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని