ముదిరాజ్‌లు మరింత ఎదగాలి: బవాలియా
eenadu telugu news
Published : 18/10/2021 04:04 IST

ముదిరాజ్‌లు మరింత ఎదగాలి: బవాలియా


బవాలియాను సన్మానిస్తున్న కార్మిక సంఘం నాయకులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఆల్‌ ఇండియా ఖోలి సమాజ్‌ అధ్యక్షుడు కువార్జీ బవాలియాకు ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్‌ సంఘం నాయకులు ఆయన్ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బవాలియా మాట్లాడుతూ.. తెలంగాణలో 52 లక్షల ముదిరాజ్‌ జనాభా ఉన్న ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు లేకపోవడం బాధాకరం అన్నారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకులు పొట్లకాయల వెంకటేశ్వర్‌ ముదిరాజ్‌, ఎస్‌ నాగయ్య, ప్రభాకర్‌, గణేష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని