25న ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌
eenadu telugu news
Published : 22/09/2021 01:55 IST

25న ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌

టీ షర్ట్‌ను ఆవిష్కరిస్తున్న అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, వివిధ శాఖల అధికారులు

మెదక్‌, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 25న మెదక్‌లో ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ను చేపట్టనున్నట్లు అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌లు తెలిపారు. మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌లో వారు ఫ్రీడమ్‌ రన్‌కు సంబంధించిన టీ షర్ట్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పౌరుల్లో దేశభక్తిని పెంచేందుకు కేంద్రం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గతేడాది ఆగస్టు 13 నుంచి మొదలైన కార్యక్రమాలు అక్టోబరు 2న ముగుస్తాయని చెప్పారు. ఇందులో భాగంగా మెదక్‌లో 25న ఉదయం 7.30 గంటలకు ధ్యాన్‌చంద్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్‌వైకే ఉమ్మడి జిల్లా అధికారిణి బిన్సీ, జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, డీఆర్డీవో శ్రీనివాస్‌, సీపీవో చిన్న కొట్యానాయక్‌, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్‌, డీపీఆర్వో శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని