సిరుల తల్లి సిరిమానోత్సవం నేడు
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

సిరుల తల్లి సిరిమానోత్సవం నేడు

 

విజయనగరం, న్యూస్‌టుడే: విజయనగరం పైడితల్లి ఉత్సవాల్లో సిరిమానోత్సవం ప్రధానమైనది. కరుణించే కరుణామూర్తి, వరాలిచ్చే కల్పవల్లి, సిరుల తల్లి.. పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవం ఆరంభం కానుంది. దేవస్థానం అధికారులతో పాటు కలెక్టర్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ఈనెల 26న తెప్పోత్సవం, వచ్చే నెల 2న ఉయ్యాలకంబాల, 3న వనంగుడిలో చండీహోమంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇప్పటికే సిరిమానుగా మలిచే ప్రక్రియ హుకుంపేటలో పూర్తయ్యింది. నేటి సంబరానికి సిరిమాను, కొత్త ఇరుసుమాను, రథాలు సిద్ధమయ్యాయి. దేవస్థానం అధికారులు 10 వేల లడ్డూ ప్రసాదం విక్రయాలకు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది వీఐపీ, ఉచిత పాసులను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. సోమవారం తొలేళ్ల సంబరం నయనానందకరంగా సాగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని