‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి’
eenadu telugu news
Updated : 24/10/2021 18:41 IST

‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి’

బలిజిపేట: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడినందున రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర్‌రావు అన్నారు. బలిజిపేటలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇదే అంశంపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించనున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు తెదేపాపై చేస్తున్న విధ్వంసక చర్యలు దురదృష్టకరమని తెలిపారు. కేంద్రప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ చర్యలపై మౌనంగా ఉండటం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల మూలాలు వైకాపా పాలన అసమర్థత వల్లే పెరిగిపోయాయని ఆరోపించారు. కార్యక్రమంలో తెదేపా అరకు పార్లమెంటు కార్యదర్శి ఎం.అప్పారావు, పార్టీ మండల నాయకులు వి.రామకృష్ణ, పి.రాము, జి.రామ్మూర్తి, ఎస్‌.రామారావు, సింహాచలం నాయుడు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని