‘చప్పుడు’ పుస్తకావిష్కరణ - Bhadradri - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

‘చప్పుడు’ పుస్తకావిష్కరణ

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య డా.జయధీర్‌ తిరుమలరావు, చిత్రంలో రచయిత్రి అనసూర్య, అతిథులు

పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదివాసీల చరిత్రలో ఆణిముత్యం.. ‘చప్పుడు’ పుస్తకమని ఆచార్య డా.జయధీర్‌ తిరుమలరావు అభినందించారు. ‘కోయ సాహిత్య అధ్యయన వేదిక’ రాష్ట్ర కన్వీనర్‌ పద్దం అనసూర్య రచించిన ‘చప్పుడు’ పుస్తకాన్ని పాల్వంచ పట్టణంలోని కుమురం భీం కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైద్యుడు సోమరాజుదొర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ అడవి బిడ్డలైన ఆదివాసీల జీవనశైలి, సంప్రదాయాలను భావితరాలకు పుస్తక రూపంలో అందజేయడం శుభపరిణామమన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల విశేషాలను కథల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చిన రచయిత్రి అనసూర్యను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు వర్సిటీ ఆచార్యులు ప్రొ.గూడూరు మనోజ, వైద్యుడు రామమోహన్‌రావు, నాయకులు కల్యాణి, నరేశ్‌కుమార్‌ సూఫీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.