close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఆటో ఢీకొని బాలుడికి గాయాలు

వినాయక ఊరేగింపు చూస్తుండగా ఘటన

కొండెవరం(కొత్తపల్లి): రహదారి వెంబడి నిల్చుని వినాయక విగ్రహ ఊరేగింపు చూస్తున్న ఓ బాలుడిని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొన్న సంఘటనలో అతడు గాయాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండెవరం గ్రామానికి చెందిన కండిపల్లి హరీష్‌ ఆదివారం మధ్యాహ్నం స్థానిక చింతచెట్టు సెంటర్‌లో నిల్చుని గణపతి విగ్రహ ఊరేగింపు తిలకిస్తుండగా ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టింది. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పార్థసారథి తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.