close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

కాకినాడ (భానుగుడి సెంటన్‌), న్యూస్‌టుడే: తిరుపతిలో బుధవారం నుంచి 25వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి అంతర్‌ జిల్లా జూనియర్స్‌ అథ్లెటిక్‌ పోటీలకు అండర్‌-14, 16 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తి చేసినట్లు అథ్లెటిక్స్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.స్పర్జన్‌రాజు తెలిపారు. గత నెల 13న రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించామన్నారు. అండర్‌-14 విభాగంలో కె.నాగలోకేంద్ర (అరట్లకట్ట), కె.శివ (ఏలేశ్వరం), ఆర్‌.సన్నిబాబు (మలిశాల), ఎం.ప్రసన్నకుమారి (గోకవరం), జి.శ్రీవల్లీక (వేట్లపాలెం), అండర్‌-16 విభాగంలో ఎస్‌.ఎస్‌ రేవంత్‌ (కాకినాడ), ఎం.రమేష్‌ (అరకు), ఎం.మహేష్‌ (కాకినాడ), టి.టి.సతీష్‌ (పామర్రు), పి.మేరీ (జగన్నాథపురం) పి.బుజ్జమ్మ (అరకు) తదితరులు హాజరుకానున్నట్లు కార్యదర్శి టీవీఎస్‌ రంగరావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.