close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

నేటితో ముగియనున్న గ్రంథాలయ వారోత్సవాలు


ముగ్గులను పరిశీలిస్తున్న గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది

వికారాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా 52వ గ్రంథాలయ వారోత్సవాలు నేటితో ముగియనున్నాయ. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మాత్రి సబితారెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఆనంద్‌, నరేందర్‌రెడ్డి, కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డి, మహేష్‌ రెడ్డిలు హాజరవుతారని గ్రంథాలయ సిబ్బంది తెలిపారు. గ్రంథాలయ ఛైర్మన్‌ కొండల్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీ, గ్రంథాలయ కమిటీ సభ్యులు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు.

రంగోళితో నిండిన గ్రంథాలయ ఆవరణ

వికారాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: అందమైన రంగులు వేసిన వారికి అందమైన బహుమతి లభిస్తుందని వికారాబాద్‌ గ్రంథాలయ కార్యదర్శి శ్రీహరి శంకర్‌ అన్నారు. 52 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రంథాలయ ఆవరణలో పాఠశాల విద్యార్థులకు, మహిళలకు రంగులతో కూడిన ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు, మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. ఈ ముగ్గులను గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది పరిశీలించారు. ముగ్గులు వేసిన వారిలో అందమైన ముగ్గులను పరిశీలించి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వారికి అందమైన బహుమతి ఇస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.