close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అల్లూరి సీతారామరాజు జయంతి

నివాళులర్పిస్తున్న నాయకులు

రాయికల్‌ పట్టణం, న్యూస్‌టుడే: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అభావిప రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లేశ్‌ కార్యకర్తలు కార్తీక్‌, జ్ఞానేశ్వర్‌, లవకుమార్‌, హరీశ్‌ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: మండలంలోని గోధూర్‌ గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. బండి గోపాల్‌, ఉడత రాజు, నవీన్‌, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు.

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కుల రాజేందర్‌, మనోజ్‌, రవి, రాకేష్‌, సత్యనారాయణగౌడ్‌, ఎర్ర రాజు పాల్గొన్నారు.

పల్లెప్రగతి పనుల పరిశీలన

రాయికల్‌, న్యూస్‌టుడే: మండలంలోని ఇటిక్యాల, మైతాపూర్‌లో శనివారం పల్లెప్రగతి పనులను జిల్లా విజిలెన్స్‌ అధికారి చిన్నయ్య పరిశీలించారు. గ్రామాలలోని ఆరోగ్య ఉపకేంద్రాలను, హరితహారం, వైకుంఠధామం, రహదారులు, పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు లావణ్య, గంగారెడ్డి, ఎంపీడీవో రమేశ్‌, ఎంపీవో శ్రీనివాస్‌, కార్యదర్శులు తదితరులున్నారు.


మల్లాపూర్‌లో సీతారామరాజు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న యువకులు

దొడ్డి కొమురయ్య వర్ధంతి

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం జగిత్యాలలో జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమురయ్య, మహేశ్‌, రమేశ్‌, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల, న్యూస్‌టుడే: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను శనివారం పట్టణంలోని సి.ప్రభాకర్‌ భవన్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాధ్యక్షుడు సుతారి రాములు, మహేష్‌, కృష్ణ, సమీర్‌, శ్రీనివాస్‌, చాంద్‌పాష, అజారొద్దీన్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని దమ్మన్నపేటలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గొర్ల కాపర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్వహించారు. యాదవ సంఘం అధ్యక్షులు కొమురెళ్లి, మురళి, మల్లేష్‌, బుచ్చన్న, భూమన్న, భూమేష్‌, తిరుపతి, సత్తన్న, లచ్చన్న పాల్గొన్నారు.

నర్సింగరావు జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కోసి, మిఠాయిలను పంచిపెట్టారు. శ్రీకాంత్‌, ప్రశాంత్‌, రాజరెడ్డి, పాల్గొన్నారు.

మెట్‌పల్లి: కాంగ్రెస్‌ పార్టీ కోరుట్ల నియోజవర్గ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలను శనివారం మెట్‌పల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పేదలకు అన్నదానం చేయడంతోపాటు, సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఖుతుబుద్దీన్‌, లింగారెడ్డి పాల్గొన్నారు.

కోరుట్ల: కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. అనాథ వృద్ధాశ్రమానికి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.

యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

కోరుట్ల, న్యూస్‌టుడే: యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని వెయిట్‌ లిఫ్టింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.సాయిలు అన్నారు. శనివారం ఆయన కోరుట్లకు రాగా మన ఫిట్‌నెస్‌ జిమ్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్‌ సన్మానించారు. మహేందర్‌, శేఖర్‌, గంగేశ్వర్‌, విజయ్‌, సతీష్‌, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు

రాంపూర్‌ పంపుహౌజ్‌ సందర్శన

మల్యాల: రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌ రాజేశంగౌడ్‌ శనివారం సాయంత్రం మల్యాల మండలంలోని రాంపూర్‌ రివర్స్‌ పంపుహౌజ్‌ను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకలను సంతరించుకొందని, పంటపొలాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. సర్పంచి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.