Vijay devarakonda: కొత్త సినిమా ప్రకటించిన విజయ్‌ దేవరకొండ.. డైరెక్టర్‌ ఎవరంటే!

విజయ్‌ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

Published : 04 May 2024 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) కొత్త సినిమా ప్రకటించారు. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్‌’తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో నటించనున్నారు. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ డైరెక్టర్‌ విజయ్‌తో సినిమా తీయనున్నట్లు పోస్ట్‌ చేయడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. గతేడాదిలోనే రవికిరణ్‌ ఈ బ్యానర్‌లో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడంతో దీనిపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా వాటికి చెక్‌ పెడుతూ వివరాలు వెల్లడించారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. పూర్తి వివరాలను విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే9న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ‘ధమాకా’ భామ శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని