Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 May 2024 12:58 IST

1. కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: షర్మిల

‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ‘‘మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగానైనా అమలవుతోందా? మూడు దశల్లో అమలు చేస్తామన్నారు. నిషేధం తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. పూర్తి కథనం

2. రాహుల్‌ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్‌

ముందు రాయ్‌బరేలీలో గెలవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశించి చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. దాంతో కాస్పరోవ్‌ వివరణ ఇస్తూ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?పూర్తి కథనం

3. పొన్నూరులో పవన్‌ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్‌ను ధ్వంసం చేసిన వైకాపా నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్‌ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పూర్తి కథనం

4. నిజ్జర్‌ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్‌ ఐఎస్‌ఐ’తో సంబంధాలు..!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు (Nijjar murder)లో నిందితులుగా పేర్కొంటూ కెనడా (Canada) పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారి ఫొటోలను విడుదల చేశారు.పూర్తి కథనం

5. పోస్టల్‌ బ్యాలెట్‌.. నరసన్నపేటలో ఓపెన్‌గానే ఓటేశారు!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. సిబ్బంది రాక ఆలస్యం కావడంతో 9.30 గంటల వరకు కేంద్రాన్ని తెరవలేదు. పోలింగ్‌ కేంద్రం తెరిచాక ఒకేసారి అధిక సంఖ్యలో ఉద్యోగులు లోపలికి ప్రవేశించారు.పూర్తి కథనం

6. టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్‌

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబయి కథ ముగిసినట్లే. ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజారాయి. వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, 170 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56), టిమ్‌ డేవిడ్ (24) కాస్త పోరాడారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (1) బ్యాటింగ్‌లో తేలిపోయాడు.పూర్తి కథనం

7. నేను గెలిస్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్‌ కుమార్‌

ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్‌కు తేవాలనేది తన లక్ష్యమని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను నగరానికి తీసుకొస్తానని తెలిపారు. సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. విద్యాసంస్థ కోసం 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించినట్లు వివరించారు.పూర్తి కథనం

8. 10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్‌ హడావుడి

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ (Brij Bhushan) ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్‌ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ను భాజపా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతోన్న తరుణంలో.. బ్రిజ్‌భూషణ్‌ స్థానికంగా తనకున్న పట్టును ప్రదర్శించారు. పూర్తి కథనం

9. ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎస్‌, డీజీపీని బదిలీ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని సీఈసీని కోరుతున్నామన్నారు. పూర్తి కథనం

10. పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్‌ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?

హమీదా బాను (Hamida Banu).. భారత తొలి మహిళా ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. 1940ల్లో క్రీడల్లో పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రోజుల్లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన మహిళ ఆమె.. ఎంతో మంది పహిల్వాన్‌లను నిమిషాల్లోనే మట్టికరిపించారు. ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా పేరొందిన ఆమెకు నివాళిగా నేడు గూగుల్‌ (Google) ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని