close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

పాల కేంద్రాల పునరుద్ధరణ

నేడు మధిర, 21న సత్తుపల్లిలో పునఃప్రారంభం

జిల్లాలో పెరగనున్న పాల సేకరణ

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

పూర్వ ఖమ్మం జిల్లాలో మూతబడిన పాల సేకరణ కేంద్రాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ ఆధ్వర్యంలో కొంతకాలం నుంచి పనిచేయని కేంద్రాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి కేంద్రాల పునరుద్ధరణకు రూ.45 లక్షలతో అవసరమైన పాల నాణ్యత పరీక్ష యంత్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో యంత్రాన్ని రూ.1.50 లక్షలతో మొత్తం 30 కొనుగోలు చేశారు. గతంలో ఈ కేంద్రాలు మూతబడి ఉన్నందున ఈప్రాంతంలోని పాడి రైతులు ప్రైవేటు డెయిరీలకు పాలను విక్రయించారు. ఈరెండు కేంద్రాలను ప్రారంభించటం వల్ల ఖమ్మం విజయ డెయిరీకి పాల సేకరణ పెరిగే అవకాశం ఉంది.

మ ధిర బీఎంసీ: ఇక్కడ ఏడాదిన్నరగా కేంద్రం మూతపడి ఉంది. దీని పరిధిలో సిరిపురం, రాయనపేట, మధిర, దెందుకూరు తదితర మొత్తం ఆరు పాల కేంద్రాలు ఉన్నాయి. దీనికి అవసరమైన మరమ్మతులు చేయించారు. సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సత్తుపల్లి బీఎంసీ: ఇది రెండేళ్ల నుంచి మూతపడి ఉంది. దీనికి కూడా అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించారు. మంగళవారం దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కేంద్రం పరిధిలో సత్తుపల్లితోపాటు దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని మొత్తం పది పాల సేకరణ కేంద్రాలున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. జిల్లాలోని రెడ్డిపాలెం బీఎంసీ కూడా 2015 నుంచి మూతపడి ఉంది. ఇక్కడ పాల సేకరణ కేంద్రాల విషయంలో స్థానికంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ప్రాంభానికి నోచుకోవటం లేదు. ఇటీవలే ఐటీడీఏ పీవో గౌతమ్‌ దీనిపై దృష్టి పెట్టారు. ఇది ప్రారంభమైతే భద్రాద్రి కొత్తగూడెం డెయిరీకి పాలసేకరణ పెరిగే అవకాశం ఉంది.

నూతన జవసత్వాలు.. ప్రస్తుతం ఖమ్మం విజయడెయిరీ ఉపసంచాలకునిగా ఉన్న శ్రావణ్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం డెయిరీకి కూడా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా మూతపడిన బీఎంసీలపై దృష్టి పెట్టారు. జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం, డీఎల్‌డీఏ పాలకవర్గం అధికారులతో కలిసి విస్తృతంగా రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విజయడెయిరీకి నూతన జవసత్వాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.