close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం 

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలోనే ఉంది. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి శాసనసభా స్థానాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 

ఈ నియోజకవర్గం నుంచి 14 మంది ప్రాతినిధ్యం వహించారు. వీటిలో ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు తెదేపా, ఒకసారి ఇందిరాకాంగ్రెస్, రెండు సార్లు భాజపా, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున డి.బలరామరాజు, ఎంటీరాజు, అల్లూరి సుభాష్‌చంద్రబోస్, కనుమూరి బాపిరాజు, చేగొండ హరిరామజోగయ్యలు, సీపీఐ తరఫున ఉద్దరాజు రామం, తెదేపా నుంచి భూపతిరాజు విజయకుమార్‌రాజు మూడుసార్లు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకసారి, భాజపా నుంచి యువీ కృష్ణంరాజు పోటీ చేసిన ఒకసారి గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్‌పై భాజపా అభ్యర్థి గోకరాజు గంగరాజు 85,480 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 
తాజా ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి తెదేపా తరపున వేటుకూరి వెంకట శివరామరాజు పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి కె.రఘురామ కృష్ణంరాజు బరిలో ఉన్నారు. జనసేన నుంచి సినీ నటుడు, పవన్‌కల్యాణ్‌ సోదరుడు నాగబాబు ఎన్నికల రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ కనుమూరి బాపిరాజును బరిలోకి దింపింది.

1952 నుంచి విజేతలు, పార్టీలు 
* 1952-1957: అద్దేపల్లి సూర్యనారాయణమూర్తి (కాంగ్రెస్) 
* 1957-1962 ఉద్దరాజు రామం (సీపీఐ) 
* 1962-1967 దాట్ల బలరామరాజు (కాంగ్రెస్) 
* 1967-1971 డి.బి.రాజు (కాంగ్రెస్) 
* 1971-1977 ఎం.టీ.రాజు (కాంగ్రెస్) 
* 1977-1984(రెండుసార్లు) అల్లూరి సుభాష్‌చంద్రబోస్ (కాంగ్రెస్) 
* 1984-1996(మూడుసార్లు) భూపతిరాజు విజయ్‌కుమార్ (తెదేపా) 
* 1996-1998 కొత్తపల్లి సుబ్బారాయుడు (తెదేపా) 
* 1998-1999 కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్) 
* 1999-2004 యు.వి.కృష్ణంరాజు (భాజపా) 
* 2004-2009 హరిరామజోగయ్య (కాంగ్రెస్) 
* 2009-2014 నుంచి కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్)
* 2014-2019 గోకరాజు గంగరాజు(భాజపా)



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net