కాఫీ.. నిద్రను ఆపొచ్చు కానీ.. తప్పులను కాదు!

తాజా వార్తలు

Updated : 05/06/2021 05:58 IST

కాఫీ.. నిద్రను ఆపొచ్చు కానీ.. తప్పులను కాదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్షలకు సన్నద్ధం.. ఆఫీస్‌ పని.. ఇలా ఏదైనా గడువులోపు పూర్తి చేయాలని చాలా మంది రాత్రుళ్లు మేల్కొని ఉంటుంటారు. నిద్ర రాకుండా ఉండటం కోసం కాఫీ తాగుతుంటారు. అయితే, కాఫీకి మెదడును ఉత్తేజపర్చి నిద్రను ఆపగలిగే శక్తి ఉంది. కానీ.. నిద్రలేమి వల్ల జరిగే తప్పులను నిలువరించే శక్తి లేదని ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో తేలింది. 

మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా కొందరికి కొన్ని టాస్క్‌లను ఇచ్చారు. వారికి నిద్ర వచ్చినప్పుడు కాఫీ ఇవ్వడంతో మెలుకవగా ఉండి టాస్క్‌ పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత మరిన్ని ఎక్కువ సవాళ్లతో కూడిన ‘ప్లేస్‌ కీపింగ్‌’ టాస్క్‌ను వారికి అప్పగించారు. దేన్ని వదిలేయకుండా, పునరావృతం చేయకుండా టాస్క్‌ పూర్తి చేయమన్నప్పుడు వారిపై కాఫీ ప్రభావం పనిచేయకపోవడంతోపాటు నిద్రలేమి స్పష్టంగా కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘‘కాఫీలో ఉండే కెఫిన్‌ నిద్రను అధిగమించి మెలుకువగా ఉండేలా చేయగలదు.. కానీ నిద్రలేమిని, నిద్రలేమి ద్వారా జరిగే అనర్థాలను ఆపలేదు. ఉదాహరణకు కాఫీ తాగి కార్‌ డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మీకు మెలుకువగా ఉన్నా నిద్రలేమి వల్ల జరిగే ప్రమాదాన్ని ఆపలేరు’’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, నిద్రలేమితో మధుమేహం, నిరాశ, గుండె జబ్బులు వస్తాయని, కాబట్టి.. నిద్రను ఆపడం కోసం కాఫీ తాగడం మంచి ఆలోచన కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని