పోర్షే కారులో వస్తేనేం.. గుంజీలు తీయ్‌!

తాజా వార్తలు

Updated : 26/04/2020 20:33 IST

పోర్షే కారులో వస్తేనేం.. గుంజీలు తీయ్‌!

ఇండోర్‌: ధనిక,పేద.. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఇండోర్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్‌ నిరూపించారు. లాక్‌డౌన్‌లో మాస్క్‌ ధరించకుండా ఖరీదైన పోర్షే కారులో వచ్చిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడుని రోడ్డుపై గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. 20 ఏళ్ల ఆ యువకుడు ఇండోర్‌లో చక్కర్లు కొడుతుండగా అతడిని స్థానిక సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు గుర్తించారు. వాలంటరీగా పనిచేస్తున్న రిటైర్డ్‌ ఆర్మీ, పారామిలిటరీ, పోలీసు అధికారి వద్దకు తీసుకువెళ్లారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మాస్క్‌ లేకుండా వచ్చినందుకు ఆయన ఆ యువకుడితో గుంజీలు తీయించారు. 

అయితే కర్ఫ్యూ పాస్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు అతిగా ప్రవర్తించారని యువకుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారం లేకుండానే తన కుమారుడితో గుంజీలు తీయించాడని వాలంటీర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని