ఆ ఇంటి కరెంట్‌ బిల్లు 80 లక్షల కోట్లు!

తాజా వార్తలు

Updated : 09/06/2020 06:45 IST

ఆ ఇంటి కరెంట్‌ బిల్లు 80 లక్షల కోట్లు!

విస్తుపోయిన ఇంటి యజమాని

భోపాల్‌: విద్యుత్‌ బిల్లు మనం అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కవగా వస్తేనే వామ్మో అంటాం. అలాంటిది ఓ సామాన్య వ్యక్తికి వేలు, లక్షలు దాటి కోట్లలో వస్తే.. అదీ లక్షల కోట్లలో వస్తే.. నిజంగా ‘కరెంట్‌ షాక్‌’ కొట్టినట్లే అనిపిస్తుంది కదూ. అయితే ఇది నిజం. విద్యుత్‌ అధికారుల నిర్వాకంతో మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుందీ ఘటన.

సింగ్రౌలి జిల్లాలో బైఢన్‌ గ్రామంలో ఓ వినియోగదారుడికి విద్యుత్‌ శాఖ సిబ్బంది నిజంగానే షాక్‌ ఇచ్చింది. అది అలాంటి, ఇలాంటి షాక్‌ కాదు.. ఏకంగా రూ.80 లక్షల కోట్ల కరెంట్‌ బిల్లు అతడి చేతిలో పెట్టింది. బిల్లు చూసి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ భారీ మొత్తంలో ఎన్ని అంకెలు ఉంటాయో లెక్కబెట్టడానికే కష్టంగా మారింది అతడికి. పలు దేశాల బడ్జెట్‌లు కలిపినా ఇంత మొత్తం రాదేమో.! ఇంత భారీ బిల్లును చూసి ఎట్టకేలకు తేరుకున్న అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బిల్లును సవరించి సరైన బిల్లు ఇవ్వాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ బిల్లుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇది చూసిన పలువురు నెటిజన్లు విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని