Ap News: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన డా.నోరి దత్తాత్రేయుడు

తాజా వార్తలు

Published : 28/09/2021 19:23 IST

Ap News: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన డా.నోరి దత్తాత్రేయుడు

అమరావతి: వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డా. నోరి దత్తాత్రేయుడుని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా. నోరి దత్తాత్రేయుడు సీఎంను కలిశారు. ప్రజారోగ్య వ్యవస్థపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు కాసేపు చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో చేపడుతున్న నాడు-నేడు, వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై  ప్రధానంగా చర్చించారు. వైద్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉండాలని డా. నోరిని ఈ సందర్భంగా సీఎం కోరారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని