KRMB: అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తా: ఉపసంఘం కన్వీనర్‌ ఆర్‌.కె.పిళ్లై

తాజా వార్తలు

Published : 17/09/2021 17:14 IST

KRMB: అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తా: ఉపసంఘం కన్వీనర్‌ ఆర్‌.కె.పిళ్లై

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ముగిసింది. ఆర్‌.కె.పిళ్లై కన్వీనర్‌గా జలసౌధలో కేఆర్‌ఎంబీ భేటీ జరిగింది. గెజిట్‌ అమలు కార్యచరణ ఖరారుపై సమావేశంలో చర్చించారు. కేఆర్‌ఎంబీ సభ్యులు, ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర వ్యవహారాల సభ్యులు, రెండు రాష్ట్రాల జెన్‌ కో అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు 10 రోజుల్లోగా ఇవ్వాలని కేఆర్‌ఎంబీ ఉపసంఘం రెండు రాష్ట్రాలను కోరింది. రూ.కోటికిపైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని కోరింది. అన్ని అంశాలు పూర్తయ్యాక సీఆర్‌పీఎఫ్‌పై చర్చించనున్నట్లు తెలిపింది. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ బోర్డు పరిధిలోకి రాదని ఏపీ అధికారులు తెలపగా.. అందుకు తెలంగాణ నిరాకరించింది. బనకచర్లను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ అధికారులు కోరారు. ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు విన్న కన్వీనర్‌ ఆర్‌.కె.పిళ్లై స్పందించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని