Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Updated : 12/05/2021 21:16 IST

Top Ten News @ 9 PM

1. ₹.35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విపక్ష నేతలు సూచించారు. మోదీకి లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితరులు ఉన్నారు. బడ్జెట్‌లో వ్యాక్సినేషన్‌కు కేటాయించిన ₹35 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని విపక్ష నేతలు లేఖలో కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. AP: మళ్లీ 20వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్‌ పరీక్షించగా 21,452మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 8,988కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* తెలంగాణలో కొత్తగా 4723 కేసులు

* తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడ్డాయి: కేటీఆర్‌

3. తెలంగాణకు కోటా పెంచుతాం: హర్షవర్దన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వరమే సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.అన్నీ ఇస్తాం.. వ్యాక్సిన్‌ తయారు చేయించండి

 కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని విన్నవించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయ, విదేశీ సంస్థలను ప్రోత్సహించాలన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. Paracetamol: గ్రాన్యూల్స్‌ నుంచి TSకు 16 కోట్ల మాత్రలు

కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న వేళ గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ సాయం చేయడానికి ముందుకొచ్చింది. 16 కోట్ల పారాసెటమాల్‌ మాత్రలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రతినిధులు బుధవారం కలిశారు. రూ. ఎనిమిది కోట్ల విలువైన  పారాసెటమాల్‌ మాత్రలు విరాళంగా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. 42 విమానాలు.. 21 రోజులు.. 1400 గంటల ప్రయాణం

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన గొప్పగా సాయం చేసింది. హనుమంతుడు ‘సంజీవని’ని తీసుకొచ్చినట్లుగా వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలు నిలబెట్టింది. 42 విమానాలు 21 రోజులుగా 1400 గంటలకు పైగా ప్రయాణం చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను మోసుకొచ్చాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఝాన్సీ లాక్‌డౌన్‌ పాఠాలు.. సాక్షి ప్రేమ కబుర్లు 

లాక్‌డౌన్‌.. కనిపించేంత సుఖం కాదంటోంది యాంకర్‌ ఝాన్సీ. చాలామందికి భరించలేని కష్టాలు తెచ్చిందని.. అలాంటి పేదలకు సాయం చేయాలని ఆమె కోరింది. * పువ్వులు ఏమీ చెప్పవు.. కానీ చూపిస్తాయంటూ నటి మీనా ఒక వీడియో పంచుకున్నారు. * స్విమ్‌ సూట్‌లో సందడి చేసింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. * ప్రేమించాలంటే ప్రతిరోజూ గొప్పదే అంటోంది హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మహేశ్‌బాబు నర్సుల ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. Positivity: 10% మించితే 6-8 వారాల లాక్‌డౌన్‌

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి దాదాపు రాష్ట్రాలన్నీ ఆంక్షల బాటపట్టాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సూచించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రేపటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పు

తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది. అదే విధంగా 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. KP: కృపయా లోగ్‌ సురక్షిత్‌ రహె!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయులకు కలిగిన కష్టం త్వరలోనే సమసిపోతుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. కొవిడ్‌ రెండో వేవ్‌ త్వరలోనే ముగుస్తుందని పేర్కొన్నాడు. దయచేసి అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ మేరకు అతడు హిందీలో ట్వీట్‌ చేశాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని