మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌ ఇండియా?
close

తాజా వార్తలు

Published : 07/08/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌ ఇండియా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల కొనుగోలుకు చర్చలు జరుపుతున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. మరిన్ని దేశాల ఆపరేషన్స్‌ను కూడా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. చైనా మినహా మిగిలిన దేశాల్లోని టిక్‌టాక్‌ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్లు సమాచారం.

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను యూఎస్‌ సంస్థకు విక్రయించాలని, లేకుంటే నిషేధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో టిక్‌టాక్‌ను కొనుగోలుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇది వరకే పేర్కొంది. ఇప్పుడు భారత్‌ సహా ఇతర దేశాల కార్యకలాపాలను సైతం సొంతం చేసుకోవాలని యోచిస్తోందని ఆ పత్రిక తన కథనంలో తెలిపింది.

భారత్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పేర్కొంటూ ఈ యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌కు భారత్‌ కార్యకలాపాలను విక్రయించే విషయంలో చర్చలు కొనసాగుతున్నట్లు టిక్‌టాక్‌ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ మైక్రోసాఫ్ట్‌తో చర్చలు సఫలం కాకపోయినా.. ఈ కార్యకలాపాలను ఇతర విదేశీ కంపెనీలకు గానీ, భారత్‌కు చెందిన సంస్థలకు విక్రయించాలని చూస్తోంది. సాంకేతికతను బదిలీ చేసి రెవెన్యూలో వాటా పొందే విధంగా ఒప్పందం చేసుకునేందుకు యోచిస్తోంది. తద్వారా దేశీయంగా తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని బైట్‌ డ్యాన్స్‌ యోచిస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం నేపథ్యంలో భారత్‌లో రోపోసో, మోజ్‌, జోష్‌, ఎంఎక్స్‌ టకాటక్‌ వంటి యాప్‌ల డౌన్‌లోడ్స్‌ పెరిగాయి.

ఇదీ చదవండి..
టిక్‌టాక్‌..యూఎస్‌లోనూ నిషేధం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని