తలతో కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
close

తాజా వార్తలు

Updated : 28/11/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తలతో కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే..!

(Photo Credit: GWR Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ‘సాధనాత్‌ సాధ్యతే సర్వం’ అంటే సాధన చేస్తే సాధ్యం కానిది లేదు అని. దీనికి చక్కటి ఉదాహరణే ఈ ఘటన. పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే మార్షల్ ఆర్ట్స్‌ నిపుణుడు అరుదైన స్టంట్‌ ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. ఎంతో ప్రమాదంతో కూడిన ఈ స్టంట్ కోసం ఆయన ఎంతో సాధన చేశారట. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..తలతో నిమిషంలో 68 కూల్‌డ్రింక్‌ సీసా మూతలను తెరిచి సరికొత్త గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఈ మేరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ప్రమాదకరమైన ఈ స్టంట్‌ను ఇంట్లో ఎవరు ప్రయత్నించొద్దని సూచిస్తూ ప్రభాకర్ రెడ్డి స్టంట్‌ వీడియోను ట్వీట్ చేసింది.

గతంలో ఈ రికార్డ్‌ పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రషీద్ నసీమ్ అనే వ్యక్తి పేరిట ఉండేది. 2016లో రషీద్ తలతో ఒక నిమిషంలో 61 కూల్‌డ్రింక్‌ సీసా మూతలను తొలగించి రికార్డును స్థాపించాడు. తాజాగా ఆ రికార్డ్‌ను ప్రభాకర్‌ రెడ్డి బద్దలు కొట్టాడు. అంతేకాదు ప్రభాకర్ పేరిట గతంలో కూడా ఓ గిన్నిస్‌ రికార్డ్ ఉంది. 2017లో చేతితో నిమిషంలో ఎక్కువ వాల్‌నట్స్‌ పగలగొట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ప్రభాకర్‌ రెడ్డి స్టంట్ వీడియోని రెండు వేల మందికిపైగా వీక్షించారు. అంతేకాదు దీన్ని సాధించడం కోసం మీరెంత సాధన చేశారో వీడియో చూస్తే తెలుస్తుంది..కంగ్రాట్స్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గమనిక: ఇది ప్రమాదకరమైన స్టంట్. ఇలాంటివి ఎవరు ఇంట్లో ప్రయత్నించొద్దని మనవి.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని