close

తాజా వార్తలు

Published : 26/11/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కేసీఆర్‌జీ..ఎన్ని కేసులైనా పెట్టుకోండి’

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ట్వీట్‌ 

బెంగళూరు: కేసులు పెట్టి భాజపాను ఆపలేరని ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో పాల్గొన్నారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వీ సూర్యపై హైదరాబాద్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తేజస్వీ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. నాపై ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి. ఇలా చేసి భాజపాను ఆపలేరు. ఎన్ని కేసులు పెడితే భాజపా అంత బలంగా తయారవుతుంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

తీవ్రంగా ఖండించిన బండి సంజయ్‌

మరోవైపు తేజస్వీపై కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ భాజపా తీవ్రంగా ఖండించింది. యువత తరఫున ప్రశ్నించిన ఆయన్ను అడ్డుకోవాలనుకోవడం కక్ష సాధింపే అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అరెస్టులు, కేసులతో భాజపాను అడ్డుకోవాలనుకోవడం అవివేకమని చెప్పారు. ఈ మేరకు సంజయ్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన