close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌: ఒకేరోజు 34వేల మంది రికవరీ!

దేశంలో 63.92శాతానికి చేరిన రికవరీ రేటు
2.31శాతానికి తగ్గిన మరణాల రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేలకు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 34,145 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకేరోజు రికార్డుస్థాయిలో ఇంతమంది కోలుకొని డిశ్చార్జి కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల్లో 8,85,577 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 4,67,882 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 63.92శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.31శాతానికి తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో 50వేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి.

టెస్టుల సంఖ్య పెంపు..
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపడుతున్నారు. గడిచిన 24గంటల్లో దాదాపు 4,40,000 కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. వీటిలో 3లక్షల 60వేల శాంపిళ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లలో నిర్వహించగా, మరో 79,878 టెస్టులు ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం నోయిడా, ముంబయి, కోల్‌కతాలో ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. వీటి ద్వారా ఒకేరోజు పదివేల శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుందని ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చదవండి..

భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు!

కిమ్‌ సామ్రాజ్యంలోకి కరోనా!


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని