
తాజా వార్తలు
నిఖిల్‌కి జోడిగా మరోసారి అనుపమ!
ఇంటర్నెట్ డెస్క్: ‘అఆ’, ‘ప్రేమమ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై అలరించిన నాయిక అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడిగా వస్తోన్న ‘18 పేజెస్’ చిత్రంలో నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. బన్నీ వ్యాస్ నిర్మిస్తున్నారు. అయితే మరోసారి నిఖిల్ కథానాయకుడిగా, చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కథానాయికగా అనుపమను తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈనెల 26 నుంచే సినిమా షూటింగును నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ‘కార్తికేయ2’ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. అనుపమ ప్రస్తుతం మలయాళంలో ‘కురుప్పు’, ‘ఫీడమ్@మిడ్నైట్ యుట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తుంది. తమిళంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ‘తల్లీ పోగథే’లో అధర్వతో కలిసి నటిస్తోంది.
ఇవీ చదవండి: