‘వైఎస్‌ భారతికి సీఎం పదవి అప్పగించండి’
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైఎస్‌ భారతికి సీఎం పదవి అప్పగించండి’

అప్పుడైనా రాష్ట్రంలో మార్పు వస్తుందేమో?
భాజపా నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు

విశాఖ: వైకాపా పాలనలో అన్నీ అస్తవ్యవస్తంగా ఉన్నాయని ఏపీ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ చేతకానితనంతో ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్‌ రాజు మాట్లాడారు.

సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగిస్తే అప్పుడైనా రాష్ట్రంలో కొంత మార్పు వస్తుందేమో చూద్దామని వ్యాఖ్యానించారు. కనీసం ఇప్పటికైనా ప్రజల ఆర్తనాదాలను జగన్‌ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని