Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/09/2021)

తాజా వార్తలు

Updated : 27/09/2021 05:58 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/09/2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

 చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఒకశుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం.   ఇష్టదైవారాధన మంచిది.

మేలైన ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం

మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.

సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.  మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి.  అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

 అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం.  నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.

గ్రహబలం  తక్కువగా ఉంది. మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

 పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

 కీలక  విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం. శివనామాన్ని జరిపించాలి.

తోటి వారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధనధాన్యవృద్ధి, ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని