12వ అంతస్తు పైనుంచి చిన్నారి.. దడ పుట్టించే దృశ్యం!
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 12వ అంతస్తు పైనుంచి చిన్నారి.. దడ పుట్టించే దృశ్యం!

హనోయ్: 12వ అంతస్తుపై నుంచి పడిపోయిన చిన్నారిని కాపాడిన ఓ డెలివరీ ట్రక్ డ్రైవర్ హీరోగా నిలిచారు. సరైన సమయంలో స్పందించి, రెండేళ్ల పాప నిండుజీవితాన్ని నిలబెట్టి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

వియత్నాంలోని హనోయ్ ప్రాంతంలో ఉన్న 12 అంతస్తుల భవనం నుంచి ఓ చిన్నారి బయటకు వచ్చింది. అక్కడే ఉన్నవారు పట్టుకోవడానికి వీలులేకుండా ఆ ఇంటికి ఉన్న గ్రిల్స్ దాటుకొని వచ్చేసింది. అప్పటికే భయంతో పాప బిగ్గరగా ఏడుస్తోంది. ఆమెను అందుకోవడం సాధ్యం కాకపోవడంతో మిగతావారు కంగారుగా కేకలు వేస్తున్నారు. ఈ శబ్దాలన్నీ ఆ భవనం కిందనే డెలివరీ సంచుల కోసం ఎదురుచూస్తున్న గుయెన్ గోక్ మాన్హ్‌ చెవిన పడ్డాయి. మొదట పాప ఏడుపే అని భావించినప్పటికీ.. తరువాత మిగతావారి కేకలు వినిపించడంతో వెంటనే పరిస్థితి ఏంటో అతడికి అర్థమైంది. భవనం చివరన ఉన్న చిన్నారి అప్పటికే పట్టుకోల్పోయి కిందికి పడటాన్ని అతడు గమనించాడు. ఆ పాప ఎటువైపు పడుతుందో అంచనా వేసి పక్కనే ఉన్న గోడ ఎక్కి, మెటాలిక్ పైకప్పు ఎక్కడానికి ప్రయత్నించి, పట్టుకోల్పోయాడు. అయినా సరే పట్టు సడలకుండా తనవంతుగా గట్టి ప్రయత్నం చేసి ఎట్టకేలకు చిన్నారిని అందుకోగలిగాడు. దాంతో ఆ పాప అతడి ఒడిని చేరుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూస్తే ఎవరికైనా గుండె దడరాక మానదు. పాప, ఆ డ్రైవర్ ఇద్దరూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ‘అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది’ అంటూ అతడు మీడియాకు తెలిపాడు. ‘నన్ను నేను గొప్ప హీరో అనిపించుకోవడం కోసం కాదు.. చిన్నారిని కాపాడేందుకే ముందుకెళ్లా’ అంటూ ఆ ట్రక్‌ డ్రైవర్‌ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని