ఎన్నికల రాష్ట్రాల్లో రేపట్నుంచే సీఈసీ పర్యటన 
close

తాజా వార్తలు

Published : 09/02/2021 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల రాష్ట్రాల్లో రేపట్నుంచే సీఈసీ పర్యటన 

దిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. బుధవారం నుంచి మూడు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. ఆరు రోజుల పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడా పర్యటించనున్నారు. ఈ పర్యటన తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నారు. బెంగాల్‌, అసోంలో ఇప్పటికే ఆయన ఒకసారి పర్యటించారు. ఈనెల మూడో వారం లేదా చివరి వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి మే, జూన్‌లోని వేర్వేరు తేదీల్లో అసెంబ్లీ గడువు పూర్తికానుండటంతో ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 

సీఈసీ సునీల్‌ అరోడా, ఎన్నిక కమిషనర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో తమిళనాడు, 12న పుదుచ్చేరి, 13, 14 తేదీల్లో కేరళలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ చర్చించనున్నారు.

ఇదీ చదవండి..

బెంగాల్‌లో హ్యాట్రిక్‌ సాధిస్తాం: మమత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని