close

తాజా వార్తలు

Published : 04/03/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ గోడ.. మీ గోడు వింటుంది!

నెలసరి బాధల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ సమయంలో కొందరు పొత్తికడుపులో సూదులు గుచ్చినట్టుగా ఉండే నొప్పితో మెలికలు తిరిగిపోతారు. విపరీతమైన నడుంనొప్పి, ఆపైన కాళ్లు గుంజేయడంతో పనులు చేసే శక్తిలేక నీరసంతో కూలబడిపోతుంటారు మరికొందరు. నిజానికి ఈ నొప్పులతో కొందరు ప్రతినెలా యుద్ధమే చేస్తుంటారు. ఇలాంటి బాధల నుంచి కాస్తయినా ఉపశమనం కలిగించడానికి తయారుచేసిందే ఈ ‘వార్మ్‌వాల్‌’. ఇండస్ట్రియల్‌ డిజైనర్‌ లారెన్‌ ఇ లీ దీన్ని రూపొందించారు. నెలసరి నొప్పితో సతమతమయ్యేవారు ఈ గోడను హత్తుకుంటే సరి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట. స్నానాలగదిలో ఎత్తుపల్లాలుగా, వేడిగా ఉండే ఈ గోడను అమర్చుకోవచ్చు. నెలసరి నొప్పులతో బాధపడే మహిళలు ఆయా శరీర భాగాలు గోడకు తాకేలా నిలుచుంటే చాలు. ఈ గోడ ఆ భాగాలకు వేడిని అందించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాగుంది కదా...


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.