ఆస్పత్రి నుంచి పరారై.. బస్సెక్కిన కరోనా బాధితురాలు
close

తాజా వార్తలు

Published : 29/05/2020 06:46 IST

ఆస్పత్రి నుంచి పరారై.. బస్సెక్కిన కరోనా బాధితురాలు

ఆందోళనలో ప్రయాణికులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వృద్ధురాలి(65)కి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడంతో ఆమెను బుధవారం రాత్రి కర్నూలు సర్వజన వైద్యశాలలో చేర్చారు. ఆమె గురువారం ఉదయం మాత్రలు తెచ్చుకొంటానని వార్డులో చెప్పి వెళ్లి ఆదోని బస్సు ఎక్కింది. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. అప్పటికే బయలుదేరిన బస్సును కోడుమూరులో ఆపి, ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 27మంది విషయం తెలిసి ఆందోళనకు గురికాగా.. వారిని వేరే బస్సులో పంపి.. బస్సును శానిటైజ్‌ చేసేందుకు డిపోనకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని