close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. శిర్డీలో నేడు బంద్‌!

మహారాష్ట్రలో ‘సాయిబాబా జన్మస్థలం’పై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ శిర్డీవాసులు ఇవాళ బంద్‌ పాటిస్తున్నారు. అయితే బాబా ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని శిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సీఈవో దీపక్‌ ముగిలీకర్‌ వెల్లడించారు. మరోవైపు, ‘పాథ్రీ కృతి సమితి’ కూడా ఆదివారం నుంచి పాథ్రీలో బంద్‌ పాటిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. వికేంద్రీకరణ దిశగా కసరత్తు!

ఏపీలో వికేంద్రీకరణ (డీ సెంట్రలైజేషన్‌) బిల్లును సోమవారమే శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో శనివారం కసరత్తు జరిగింది. వికేంద్రీకరణ బిల్లుపైనా మంత్రిమండలి చర్చించి, దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్‌!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి మూడో వారంలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఆ సమావేశాలను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ దఫా కూడా వాస్తవిక పద్దును ఆమోదించాలనే యోచనలో ప్రభుత్వం ఉండగా, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చేలా అన్ని శాఖలకు సీఎస్‌ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆంగ్ల మాధ్యమంపై అభిప్రాయసేకరణ

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం కావాలా? లేదా తెలుగు మాధ్యమం కావాలా? అనే దానిపై తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలను తీసుకునేందుకు 21న సమావేశాలు నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 2.86 లక్షల మందుపూత దోమతెరలు

మలేరియా, డెంగీ తదితర విషజ్వరాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు   చేపట్టింది. దీనిలోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.86 లక్షల మందుపూత దోమతెరల పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. మలేరియా పీడిత గ్రామాలు 2067, డెంగీ ముప్పు ఉన్న పల్లెలు 1414, పురపాలికలు 36 ఉన్నట్లుగా ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో దోమతెరలను పంపిణీ చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మళ్లీ మెరిసెను భాగ్యనగరం

హైదరాబాద్‌ మహానగరానికి 2018 తర్వాత మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి (టాప్‌-20) నగరాల్లో ప్రథమ స్థానం సాధించింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరొందిన జేఎల్‌ఎల్‌(జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె) సంస్థ అధ్యయనం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు: ఐజీ

ఏపీ రాజధాని మార్పుపై ఈ నెల 20న ఐకాస తెలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి ఎలాంటి అనుమతులూ లేవని గుంటూరు రేంజ్‌ ఐజీ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఐకాస ముట్టడి కార్యక్రమం సెక్షన్‌ 144కు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలెవరూ హాజరుకావొద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పౌరసత్వమంటే హక్కులే కాదు.. బాధ్యతలు కూడా

పౌరసత్వమంటే కేవలం హక్కులు మాత్రమే కాదని, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యతల్నీ ఇది పేర్కొంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే చెప్పారు. శనివారం ‘రాష్ట్రసంత్‌ తుకడోజీ మహారాజ్‌ నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం’ (ఆర్‌టీఎంఎన్‌యూ) 107వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘విశ్వవిద్యాలయాలు ఉన్నది మూస పద్ధతిలో విద్యార్థుల్ని తయారు చేయడానికి కాదు. ఎప్పటికప్పుడు మారుతుండే సమాజ అవసరాలకు దీటుగా వర్సిటీలు తమను తాము మార్చుకోవాలి’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఈ నాణెం ధర రూ.9.10 కోట్లు

నాటి బ్రిటన్‌ రాజు ఎడ్వర్డ్‌-8 బొమ్మ ముద్రించి ఉన్న అరుదైన ఈ బంగారు నాణెం ఇటీవల జరిగిన వేలంలో దాదాపు రూ.9.10 కోట్ల ధరపలికింది. పేరు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. 1936లో కింగ్‌ ఎడ్వర్డ్‌-8 అమెరికన్‌ మహిళ విల్లిస్‌ సింప్సన్‌ను వివాహం చేసుకునేందుకు ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించడానికి ముందు కాలానికి చెందిన నాణెంగా భావిస్తున్నారు.

10. అమ్మ అదరగొట్టింది

అమ్మగా సానియా మీర్జా తొలి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌ భామ నదియాతో కలిసి హోబర్ట్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో బరిలో దిగిన సానియా విజేతగా నిలిచింది. మరోవైపు రాజ్‌కోట్‌ వన్డేలో పైచేయి సాధించిన టీమ్‌ఇండియా అదే జోరుతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తపిస్తోంది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉండగా.. ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొంటుంది. i. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  ii. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.