close

తాజా వార్తలు

Published : 21/11/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్కరికి తప్ప ఆ గ్రామంలో అందరికి కరోనా

థొరాంగ్: ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా ఒక్కరు మినహా ఆ గ్రామంలోని ప్రజలందరు కరోనా వైరస్ బారినపడ్డారని అధికారులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్ లోయలోని థొరాంగ్ గ్రామంలోని ప్రజలకు ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైంది. 42 మంది ఉన్న ఆ గ్రామంలో 52ఏళ్ల భూషణ్ ఠాకూర్ మినహా మిగిలిన వారంతా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ గ్రామం మనాలి-కెలాంగ్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉంది. 

‘గత నాలుగు రోజులుగా నా భోజనం నేను వండుకుంటున్నాను. వేరే గదిలో ఉంటున్నారు. ఫలితాలు వచ్చే వరకు నేను నా కుటుంబంతోనే ఉన్నాను. కానీ, కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాను. ఈ వ్యాధిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. శీతకాలం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని భూషణ్ మీడియాకు వెల్లడించారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఆ గ్రామస్థులందరూ వైరస్ బారిన పడ్డారని ఆధికారులు ఆరోపిస్తున్నారు. 

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్‌-స్పితి లోయలోని ప్రజలు కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ జిల్లాకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు చాలా మంది వైరస్ బారిన పడ్డారు. దాంతో స్థానికులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభ్యర్థించారు. వైరల్‌ ఇన్ఫెక్షన్లు, వాతావారణ మార్పులు ప్రస్తుత పరిస్థితికి కారణమని వెల్లడించారు. ఈ జిల్లాలో 30 వేల మంది జనాభా ఉండగా..ఇప్పటివరకు 856 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 

పర్యాటకుల రాకపై ఆంక్షలు:
వైరస్ కారణంగా మనాలి-కెలాంగ్‌ జాతీయ రహదారి సమీపంలోని లాహాల్ లోయలో చాలా గ్రామాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారాయి. దాంతో పర్యాటకుల రాకపోకలపై యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది. ఈ జోన్లలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటోంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన