హైదరాబాద్‌ యువకుడికి యువతి వేధింపులు
close

తాజా వార్తలు

Published : 14/03/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ యువకుడికి యువతి వేధింపులు

హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో మోసపోతున్న యువతి, యువకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి చేతిలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన యువకుడికి రాజస్థాన్‌కు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పరిచయం తర్వాత యువకుడి నంబర్‌ తీసుకున్న యువతి వాట్సాప్‌ వీడియో కాల్ చేసింది. వాట్సాప్‌ ద్వారా అతని నగ్న వీడియోలను సేకరించి బెదిరింపులు మొదలుపెట్టింది. అలా దాదాపు రూ.2 లక్షలు వసూలు చేసింది. మరింత డబ్బు కోసం బెదిరించడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని