Sports News: అతడు తన పెద్దన్న అంటున్న యూజీ
close

తాజా వార్తలు

Published : 25/05/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sports News: అతడు తన పెద్దన్న అంటున్న యూజీ

ముంబయి: టీమ్‌ఇండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మతో తనకు ఎప్పట్నుంచో అనుబంధం ఉందని మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అన్నాడు.  అతడి సారథ్యంలోనే తాను లీగ్‌ క్రికెట్లో అరంగేట్రం చేశానని పేర్కొన్నాడు. కుల్‌దీప్‌తోనూ తనకు సాన్నిహిత్యం ఉంటుందన్నాడు. వీరిద్దరినీ తాను పెద్దన్నలుగా భావిస్తానని వెల్లడించాడు. 2011లో యూజీ ముంబయి తరఫున ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడాడు.

‘రోహిత్‌ భయ్యాతో నాకెంతో అనుబంధం ఉంది. 2011 నుంచీ మేం ఒకరికొకరం తెలుసు. అప్పుడే నేను ముంబయి ఇండియన్స్‌కు వచ్చాను. రోహిత్‌ వల్లే నేను ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాను. మొదట్లో నాకెలాంటి అవకాశాలు రాలేదు. ఒక మ్యాచులో రికీ పాంటింగ్‌ నుంచి రోహిత్‌ భయ్యా సారథ్యం తీసుకున్నాడు. నా గదిలోకి వచ్చి ఈరోజు మ్యాచ్‌ ఆడుతున్నావ్‌ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే భజ్జీ పా, ప్రజ్ఞాన్‌ ఓజా భయ్యా జట్టులో ఉన్నారు. ముంబయి ఎప్పుడూ ముగ్గురు స్పిన్నర్లతో ఆడలేదు’ అని యూజీ అన్నాడు.

టీమ్‌ఇండియాలోకి వచ్చాక కుల్‌దీప్‌ యాదవ్‌, తాను విడదీయలేనంత సన్నిహితంగా ఉండేవాళ్లమని చాహల్‌ తెలిపాడు. ‘కుల్‌దీప్‌ నా సోదరుడిలా ఉంటాడు. మేమిద్దరం అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లం. ఒకగదిలో ఉండేవాళ్లం. అతడితో గీత దాటకుండా ఎంత సరదాగానైనా ఉండొచ్చు. ఎందుకంటే పరస్పరం గౌరవించుకోవడం అవసరం. అందుకే మా మధ్య బంధం బలపడింది’ అని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని