close

ప్రధానాంశాలు

‘చేయగలం’.. ఇదే నూతన మంత్రం

జలవనరుల సంరక్షణలో పెరిగిన ప్రజల భాగస్వామ్యం
కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం
మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: ‘‘చేయగలం’’ అన్న మాటే నూతన భారతదేశానికి కొత్త మంత్రం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మంత్రాన్ని ఆచరించి ప్రజలు భాగస్వాములైతే నూతన పంథాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగిస్తూ ‘‘చేయగలం’’ అన్న స్ఫూర్తి జల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ‘‘ఇంతవరకు పారిశుద్ధ్యం విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు అది జలసంరక్షణకు విస్తరించింది. నీటి నిల్వకు దేశం నలుమూలలా కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు’’ అని చెప్పారు. గత వర్షాకాలంలో ప్రధాని మోదీ జలశక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు తదతర రాష్ట్రాల్లో స్థానికులు తీసుకుంటున్న చొరవను ఆయన వివరించారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఫిట్‌ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ఆన్‌లైన్‌ నమోదు ద్వారా దేశంలోని 65 వేల పాఠశాలలు ఫిట్‌ ఇండియా పాఠశాలలు అన్న ధ్రువీకరణను పొందాయని చెప్పారు. మిగిలిన పాఠశాలలూ దీనిని అనుసరించాలని కోరారు.

34 వేల మంది గిరిజనులకు పునరావాసం
మిజోరాం రాష్ట్రానికి చెందిన 34వేల మందికి పైగా బ్రూ-రియంగ్‌ గిరిజనులకు త్రిపురలో పునరావాసం కల్పించనున్నట్టు ప్రధాని చెప్పారు. 1997లో జరిగిన ఘర్షణల కారణంగా వారు త్రిపుర రావాల్సి వచ్చిందని, అప్పటి నుంచి 23 ఏళ్లుగా తాత్కాలిక పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని అన్నారు. అందువల్ల రూ.600 కోట్లు వెచ్చించి వారికి త్రిపురలోనే సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

హింస పరిష్కార మార్గం కాదు
సమస్యల పరిష్కారానికి హింస, ఆయుధాలే మార్గమని ఇంకా చాలా మంది నమ్ముతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది సరికాదని చెప్పారు. సొంత సామర్థ్యాలు, దేశం శక్తిపై నమ్మకం ఉంచి వారంతా జీవన స్రవంతిలో కలవాలని కోరారు.


ప్రజల అవార్డులుగా పద్మ పురస్కారాలు

ప్రతిభ చూపిన సామాన్యులను గౌరవిస్తుండడంతో పద్మ పురస్కారాలు ప్రజల అవార్డులుగా మారాయని ప్రధాని అన్నారు. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల కోసం 46వేల దరఖాస్తులు వచ్చాయని, ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.