Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143020
            [news_title_telugu_html] => జనసేనను విలీనం చేయమన్నారు..:పవన్‌
            [news_title_telugu] => జనసేనను విలీనం చేయమన్నారు..:పవన్‌
            [news_title_english] => Janasena Chief Pawan Kalyan Comments in Party Workers Meeting
            [news_short_description] => జనసేనను తమలో విలీనం చేయాలంటూ ఓ పార్టీకి చెందిన నేతలు తనపై ఒత్తిడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు....

            [news_tags_keywords] => Pawan Kalyan,Janasena,Ap Politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-17 00:25:38
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
జనసేనను విలీనం చేయమన్నారు..:పవన్‌ - Janasena Chief Pawan Kalyan Comments in Party Workers Meeting - EENADU
close

తాజా వార్తలు

జనసేనను విలీనం చేయమన్నారు..:పవన్‌

అమరావతి: జనసేనను తమలో విలీనం చేయాలంటూ ఓ పార్టీకి చెందిన నేతలు తనపై ఒత్తిడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులతో పవన్‌ సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా తనకు తెలియజేయాలని.. సామాజిక మాధ్యమాలకు ఎక్కొద్దని సూచించారు. జనసేన భావజాలంతో కూడిన పార్టీ అన్నారు. కొంత మంది బెదిరిస్తే భయపడిపోయే వ్యక్తిని కాదని చెప్పారు. వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పార్టీ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలని పవన్‌ పిలుపునిచ్చారు. ఓటమి బాధ ఉన్నా పార్టీని బలహీనపరచాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం పనితీరుపై స్పందిస్తామని పవన్‌ స్పష్టం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.