close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రయాణం హాయి!

విమాన ప్రయాణికులకు అందుబాటులో ‘హోయి’!

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, దిల్లీ విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉన్న హోయి (హెచ్‌ఓఐ) యాప్‌ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఆహారం ఆర్డర్‌ ఇచ్చేందుకు రూపొందించిన హోయితో ప్రస్తుతం విమానాశ్రయంలో చెకిన్‌, షాపింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, క్యాబ్‌ సర్వీసులు, ఇతరత్రా సౌకర్యాలు కూడా పొందే అవకాశం ఉంది.

ఇవీ ప్రయోజనాలు
* ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలు హోయి యాప్‌తో అనుసంధానించాలి లేదా టికెట్‌ వివరాలు స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. దీనివల్ల ఇంటి నుంచి బయల్దేరి విమానాశ్రయానికి..తదుపరి గమ్యస్థానానికి చేరుకునే వరకు ప్రతి దశలో అవసరమైన సమాచారం యాప్‌ ద్వారా అందిస్తుంది.
* ప్రయాణికులు తమ విమాన వివరాలు ట్రాక్‌ చేయవచ్చు. చెకిన్‌ గేట్లలో మార్పులు, గమ్యస్థానం వద్ద వాతావరణం వంటి వివరాలు పొందే వీలుంది. క్యాబ్‌, ఇతరత్రా సదుపాయాలను బుక్‌ చేసే వీలుంది.
*విమానాశ్రయంలో రద్దీ వివరాలు, చెకిన్‌, సెక్యూరిటీకి పట్టే సమయం, బోర్డింగ్‌ గేట్‌కు ఉన్న దూరం తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
* యాప్‌లో జియో ఫెన్సింగ్‌ సౌకర్యం ఉండటంతో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ప్రవేశించిన వెంటనే ప్రయాణికులు ఆటో చెకిన్‌ అవుతారు. దీనివల్ల నేరుగా భద్రతాపరమైన స్క్రీనింగ్‌ కోసం వెళ్లే సమయం ఆదా అవుతుంది.

ఆన్‌లైన్‌లో పదివేల ఉత్పత్తులు:  80 ప్రముఖ అవుట్‌లెట్‌లతో అనుసంధానించడం ద్వారా పదివేలకు పైగా ఉత్పత్తులు ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకువచ్చారు. స్కాన్‌ అండ్‌ షాప్‌ సౌకర్యంతో వంద శాతం సురక్షితంగా షాపింగ్‌ చేయవచ్చని,  రెండు విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ దుకాణాల్లో ఈ సదుపాయం పొందే వీలుందని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు