రెండో దశలో 99.35 శాతం కోలుకున్నారు
close

ప్రధానాంశాలు

రెండో దశలో 99.35 శాతం కోలుకున్నారు

మొదటి ఉద్ధృతిలో ఈ శాతం 99.40
ఆరోగ్యశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండోదశ కొవిడ్‌ ఉద్ధృతిలోనూ కోలుకున్నవారు 99.35 శాతంగా నమోదయ్యారు. తొలిదశలో కోలుకున్నవారు ఇంచుమించుగా ఇదే తరహా(99.40 శాతం)లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి రెండోదశ కొవిడ్‌ ఉద్ధృతిని పరిగణనలోకి తీసుకుంటే..జూన్‌ 13 నాటికి మొత్తంగా 3,04,446 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,850 (0.65 శాతం) మంది కన్నుమూయగా.. 2,83,361 మంది కోలుకున్నారు. రెండో దశ ఉద్ధృతిపై వైద్యఆరోగ్య శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
* రాష్ట్రంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి జూన్‌ 13 వరకూ మొత్తంగా 1,67,23,910 నమూనాలను పరీక్షించగా.. కేవలం రెండోదశలో 80,02,884 నమూనాలను పరీక్షించారు.
* తొలిదశ నుంచి ఇప్పటి వరకూ పాజిటివ్‌ రేటు 3.60 శాతంగా ఉండగా.. ఒక్క రెండోదశలో 3.80 శాతంగా నమోదైంది.
* మే నెల 1 నుంచి జూన్‌ 13 వరకూ వారాల వారీగా పరిశీలిస్తే.. తొలివారంలో 8.69 శాతం పాజిటివ్‌ రేటు ఉండగా.. 6వ వారానికి వచ్చేసరికి 1.43 శాతానికి తగ్గిపోయింది. ఇవే తేదీల నడుమ తొలివారంలో కోలుకున్నవారు 84.81 శాతం మంది ఉండగా.. 6వ వారానికి 95.63 శాతానికి పెరిగారు.
* మార్చి 1 నుంచి జూన్‌ 14 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల్లో చేరికలను పరిశీలిస్తే.. తొలివారంలో చేరికలు 7 శాతం నమోదవగా.. 10-11వ వారానికి వచ్చేసరికి53 శాతం పడకలు నిండాయి. జూన్‌ 14 నాటికి కొవిడ్‌ పడకల్లో చేరికలు 16 శాతానికి తగ్గాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని