Free Vaccine: దిల్లీలోనూ ఉచిత వ్యాక్సిన్‌!

తాజా వార్తలు

Updated : 26/04/2021 15:21 IST

Free Vaccine: దిల్లీలోనూ ఉచిత వ్యాక్సిన్‌!

రాష్ట్రాలకూ రూ.150కే అందించాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కరోనా టీకా ఉచితంగా అందజేస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను సేకరించి టీకా పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకరు డోసుకు రూ.400, మరొకరు రూ.600 చెబుతున్నారని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. కేంద్రానికి మాత్రం రూ.150కే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలకు సైతం కేంద్రానికి ఇస్తున్న ధరకే టీకాలను అందజేయాలని ఆయన టీకా ఉత్పత్తిదారులను కోరారు. వ్యాక్సిన్ ధరలు అందరికీ ఒకేలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లాభాలు ఆర్జించేందుకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టీకా ధరలపై పరిమితి విధించాలని కోరారు.

అలాగే 18 ఏళ్ల లోపువారికి కూడా కరోనా సోకుతోందని కేజ్రీవాల్‌ తెలిపారు. వారిలో కొందరు చనిపోతున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సురక్షితం, ప్రభావవంతం అనుకుంటే 18 ఏళ్ల లోపు వారికి కూడా టీకా ఇవ్వాలని కోరారు. లేదా చిన్నారుల కోసం కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దిల్లీతో కలిపి 18 రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మరోవైపు కేంద్రం సేకరించే 50 శాతం టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా అందించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని