షహీన్‌బాగ్‌: ‘మీలానే వారికీ హక్కులుంటాయ్’

తాజా వార్తలు

Published : 20/02/2020 01:18 IST

షహీన్‌బాగ్‌: ‘మీలానే వారికీ హక్కులుంటాయ్’

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న మహిళలను సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తులు కలిశారు. సీనియర్‌ న్యాయవాదులు సంజయ్‌ హెగ్డే, సాధనా రామచంద్రన్‌ నిరసనకారులతో బుధవారం మాట్లాడారు. తొలుత సుప్రీం కోర్టు ఉత్తర్వులను వారికి చదివి వినిపించారు.

నిరసన తెలిపే హక్కును సుప్రీంకోర్టు తోసిపుచ్చలేదని, అదే సమయంలో ఇతరుల హక్కుల గురించి కూడా ఆలోచన చేయాలని నిరసనకారులకు మధ్యవర్తులు సూచించారు. రోడ్లను ఉపయోగించుకోవడం ఇతరుల హక్కు కూడా అని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ వైపు నుంచి కూడా ఆలోచించాలన్నారు. అందరి మొర ఆలకిస్తామని, కలిసి పనిచేసి ఒక నిర్ణయం తీసుకుందామని సూచించారు. అయితే, మీడియాకు దూరంగా చర్చలు జరగాలని మధ్యవర్తులు కోరగా.. అందుకు మహిళలు నిరాకరించారు. మీడియా ఎదుటే చర్చలు జరగాలని కోరారు.

షహీన్‌బాగ్‌లో రోడ్లను నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇద్దరు మధ్యవర్తులను సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఆందోళన చేసేందుకు వారిని ఒప్పించాలని మధ్యవర్తులకు సుప్రీం కోర్టు సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని