వేలెత్తి చూపేందుకు ఇది సమయం కాదు..

తాజా వార్తలు

Published : 19/05/2020 18:48 IST

వేలెత్తి చూపేందుకు ఇది సమయం కాదు..

బ్రస్సెల్స్‌ : ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను తప్పుబట్టేందుకు ఇది సమయం కాదని యూరోపియన్‌ యూనియన్‌ పేర్కొంది.  కరోనా వ్యాధిపై మొదట్లోనే సమాచారం అందినప్పటికీ దాన్ని నిర్ధారించుకోవడంలో ఆరోగ్యసంస్థ విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆ సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌కు లేఖ రాసిన సంగతి తెలిపిందే. దీంతో పాటు రానున్న 30 రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ తన విధానాలను మెరుగుపరుచుకోకపోతే నిధుల్ని శాశ్వతంగా ఆపేందుకు కూడా వెనకాడబోనని తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. 

సంఘీభావ సమయమిది.

అయితే ట్రంప్‌ ప్రకటన సరికాదని ఈయూ పేర్కొంది.  ప్రపంచమంతా సమష్టిగా కరోనాపై పోరు చేస్తోందని ఈ దశలో ఒకరిని బాధ్యుడిగా చేస్తూ వేలెత్తి చూపడం సబబు కాదని ఈయూ విదేశీ వ్యవహారాలప్రతినిధి వ్యాఖ్యానించారు. మహమ్మారి ఎలా వచ్చింది అన్న అంశంపై  స్వతంత్ర్య, సమగ్రతతో కూడిన పక్షపాతం లేని అధ్యయనం అవసరమన్న తీర్మానాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ సమావేశంలో ఈయూ ప్రతిపాదించింది. కరోనాపై పోరులో ఆరోగ్యసంస్థకు సాయంగా  అదనపు నిధులను ఈయూ ప్రకటించనుందని తెలుస్తోంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం పలు సందర్భాల్లో ఈయూ-అమెరికా మధ్య  అభిప్రాయభేదాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ అంశంలోనూ ఇరువురి మధ్య దూరం పెరిగింది. డబ్ల్యూహెచ్‌ఓ చైనా చేతిలో కీలుబొమ్మని ట్రంప్‌ ఆరోపించారు. మరో వైపు వైరస్‌ నివారణకు  జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు అనేక సంస్థలు యత్నిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఈయూ నిధులు ఇవ్వనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని