vaccination: ఒక్కరోజే కోటి డోసులు పంపిణీ.. వ్యాక్సినేషన్‌లో భారత్‌ కీలక మైలురాయి

తాజా వార్తలు

Published : 27/08/2021 22:49 IST

vaccination: ఒక్కరోజే కోటి డోసులు పంపిణీ.. వ్యాక్సినేషన్‌లో భారత్‌ కీలక మైలురాయి

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ అరుదైన మైలురాయిని అందుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే కోటి డోసులకు పైగా పంపిణీ చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే కోటి డోసులకు పైగా పంపిణీ చేసి రికార్డు నెలకొల్పడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు రాత్రి 10గంటల వరకు దేశ వ్యాప్తంగా 1,00,64,032 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ జరిగినట్టు కొవిన్‌ పోర్టల్‌లో నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని