కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

తాజా వార్తలు

Updated : 08/07/2021 14:05 IST

కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

దిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. కేంద్రంలో నరేంద్రమోదీ కేబినెట్‌లో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 నెలల ఏడు రోజుల వ్యవధిలోనే కిషన్‌రెడ్డి పదోన్నతి పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కేబినెట్‌ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు. గంగాపురం కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించారు. 2019లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యాటక శాఖ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తానన్నారు. ‘‘ పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. అధికారులతో సమీక్షించాక ప్రధాని దిశానిర్దేశంతో ముందుకెళ్తాం. విశేషమైన 3 శాఖలు ప్రధాని మోదీ నాకు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని