కాబోయే భార్యకు చంద్రుడిపై భూమి

తాజా వార్తలు

Published : 15/02/2021 07:41 IST

కాబోయే భార్యకు చంద్రుడిపై భూమి

ఇండోర్‌: ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే భార్య కోసం ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు ఇండోర్‌కు చెందిన పలాష్‌ నాయక్‌. అంతేకాదు ఒక నక్షత్రానికి ఆమె పేరు కూడా పెట్టారు. పలాష్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ ఫ్రీ లాంచింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అతని కాబోయే భార్య హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. తన ప్రియమైన వారికి భిన్నంగా ఏదైనా చేయాలనే అభిరుచిలో భాగంగానే చంద్రునిపై భూమి కొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పలాష్‌ పేర్కొన్నారు. చంద్రునిపై ఒక ఎకరం భూమిని కలిగి ఉన్నట్లు ధ్రువపత్రాన్ని కూడా పొందాడు. అంతకుముందు భారతదేశంలో కొంత మందికి మాత్రమే చంద్రుడి మీద భూమిని సొంతం చేసుకున్న అనుభవం ఉంది. వీరిలో బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, షారూక్‌ ఖాన్‌ ఉన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని