కుంభమేళా: కరోనా టెస్టులు తప్పనిసరి

తాజా వార్తలు

Published : 25/01/2021 21:57 IST

కుంభమేళా: కరోనా టెస్టులు తప్పనిసరి

కుంభమేళా ఎస్‌వోపీ విడుదల చేసిన కేంద్రం

హరిద్వార్‌: కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగటివ్‌ ఆర్టీ-పీసీఆర్‌ రిపోర్టులు తీసుకురావాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వం సోమవారం కుంభమేళాలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌వోపీ)ని విడుదల చేసింది. కుంభమేళాకు రానున్న భక్తులు హరిద్వార్‌కు చేరుకొనే 72గంటల్లోపు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసుకొని రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది మాత్రమే ఈ కుంభమేళాలో పాల్గొంటారని వారు తెలిపారు. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. కుంభమేళాకు వెళ్లే అన్ని మార్గాల్లో మాస్కులను పంపిణీ చేస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

65ఏళ్లకు పైబడినవారు, చిన్నారులు, గర్భిణులకు కుంభమేళాకు అనుమతి లేదన్నారు. కుంభమేళా నిర్వాహకులు ఎప్పటి కప్పుడు శానిటైజ్‌ చేస్తూ పర్యవేక్షిస్తారని వారు తెలిపారు. నిర్వాహకులు ఇప్పటికే 1,000 మంచాలతో కూడిన తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అంబులెన్సులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. సాధారణ రోజుల్లో 10లక్షల మంది, ప్రత్యేక రోజుల్లో 50లక్షల మంది వరకూ పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి..

టీకాపై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవ్‌

కొవిడ్‌ ఔషధ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని