
ప్రధానాంశాలు
గత డిసెంబరులోనే అమెరికాలో కరోనా వ్యాప్తి!
వాషింగ్టన్: అందరూ అనుకుంటున్న దానికంటే ముందుగా... అమెరికాలో గత డిసెంబరులోనే కరోనా వైరస్ వ్యాపించి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. రెడ్ క్రాస్ సంస్థకు దాతలిచ్చిన రక్త నమూనాలను విశ్లేషించడంతో ఈ విషయం వెలుగు చూసినట్టు తెలిపింది. అగ్రరాజ్యంలో తొలి కొవిడ్-19 కేసు ఈ ఏడాది జనవరి 19న అధికారికంగా నమోదైంది. అయితే అంతకుముందు డిసెంబరు 13-16 తేదీల మధ్య రెడ్‌క్రాస్ సంస్థ సేకరించిన రక్త నమూనాలను... వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (సీడీసీ) పరిశోధకుడు వి.బసవరాజు నేతృత్వంలోని బృందం నిశితంగా విశ్లేషించింది.
మొత్తం 7,389 శాంపిళ్లను పరీక్షించగా, 106 నమూనాల్లో కరోనా వైరస్‌ను నియంత్రించే యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది! ‘‘అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో గత డిసెంబరు తొలి రోజుల్లోనే కొవిడ్-19 ఇన్ఫెక్షన్ వ్యాపించి ఉండొచ్చని తెలుస్తోంది. కొందరి రక్త నమూనాల్లో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను న్యూట్రలైజ్ చేసే ఎస్1 రకం యాంటీబాడీలను గుర్తించాం’’ అని పరిశోధకులు తెలిపారు. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పత్రిక ఈ అధ్యయన వివరాలను అందించింది.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
